14న కేజ్రీవాల్‌తో అమిత్ షా భేటీ

by vinod kumar |
14న కేజ్రీవాల్‌తో అమిత్ షా భేటీ
X

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్‌లు ఆదివారం భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు సహా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాలూ పాల్గొనబోతున్నారు. కాగా, కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత ఆయనతో అమిత్ షా బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కరోనా కేసులు 40వేలకు సమీపిస్తున్న తరుణంలో ఇక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు ఈ సమావేశాన్ని కేంద్రమంత్రి నిర్వహిస్తు్ండటం గమనార్హం.

Advertisement

Next Story