కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేరారు. అమిత్ షాకు కొన్ని దీర్ఘకాలవ్యాధులున్నాయని వైద్యులు తెలిపారు. ఇప్పటి నుంచి అతని ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని వివరించారు. కరోనా పాజిటివ్ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నారని, ఈ టెస్టులో వైరస్ పాజిటివ్‌గా తేలిందని వివరించారు. అయితే, తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి చేరుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇటీవలి కొన్ని రోజులు తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ ఐసొలేషన్‌లో ఉండాలని, ఎంక్వైరీ చేయించుకోవాలని సూచించారు. గతవారం నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపిన క్యాబినెట్ సమావేశంలో అమిత్ షా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Advertisement