- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతికి అమిత్‌షా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు: సీపీఐ నారాయణ
దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. కర్నూల్ లో మీడియాతో నారాయణ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం దేశంలో మత్తు మందు సరఫరా చేస్తున్న ఆదానీని విడిచిపెట్టి షారుఖ్‌ఖాన్ కుమారుడిని పట్టుకుని వేధిస్తున్నారని విమర్శించారు. తిరుపతికి వచ్చిన ప్రధాని మోదీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చి ఇన్నాళ్లు అవుతున్నా నేటికి అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు.
పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి నామమాత్రంగా రూ. 10, రూ.5 తగ్గిస్తారా అంటూ మండిపడ్డారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని చేపడుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వానికి కోపం ఉంటే ఆయన్ను అరెస్ట్ చేయాలని, అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని తెలిపారు.
కావాలంటే చంద్రబాబును అరెస్టు చేసుకోండని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రలో సంఘ వ్యతిరేక, విద్రోహ శక్తులు లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ షీటర్లు ఉండేది అధికార వైసీపీలోనే నని ఆరోపించారు.