అభిమానులకు అమీర్ కరోనా జాగ్రత్తలు

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ తన స్టాఫ్‌లో కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సత్వరమే స్పందించి వారికి సరైన వైద్యం అందించారని.. ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్టెరిలైజ్ చేశారని తెలిపారు. కాగా, తన స్టాఫ్ విషయంలో కేర్ తీసుకున్న అధికారులకు థ్యాంక్స్ చెప్పారు అమీర్.

తన ఫ్యామిలీతో పాటు మిగతా సిబ్బందికి టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపిన అమీర్.. చివరగా అమ్మకు టెస్ట్ చేయిస్తున్నట్లు తెలిపారు. తనకు నెగెటివ్ రావాలని ప్రార్థించాలని అభిమానులను కోరారు.

ముంబై కోకిలా బెన్ ఆస్పత్రి వైద్య సిబ్బంది సేవలను ప్రశంసించిన అమీర్.. టెస్టింగ్ ప్రాసెస్ విషయంలోనూ చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నట్లు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని అభిమానులను కోరారు అమీర్.

Advertisement