- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజీఎఫ్ హీరోకు సారీ చెప్పిన అమీర్ ఖాన్..
దిశ, సినిమా: బాలీవుడ్ భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘లాల్ సింగ్ చద్దా’ నిజానికి క్రిస్మస్‌కు రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో ఆలస్యమవడంతో న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు అఫిషియల్‌గా ప్రకటించారు. అయితే అదే రోజున మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కేజీఎఫ్ 2’ కూడా రిలీజ్ కాబోతోంది. అమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల తేదీ ప్రకటించకముందే.. ఈ సినిమా విడుదల తేదీ నిర్ణయించారు.
కాగా ఈ డేట్స్ క్లాష్‌పై తాజాగా స్పందించిన అమీర్.. ‘మరొకరి భూభాగాన్ని ఆక్రమిస్తున్నాననే అభిప్రాయాన్ని కలిగించడం నాకు అసహ్యం. కానీ నా కెరీర్‌లో మొదటిసారి సిక్కుగా నటిస్తున్నాను. కాబట్టి ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలకు ‘బైసాఖీ డే(ఏప్రిల్ 14)’ అత్యంత సముచితమైందిగా అనిపించింది’ అని తెలిపాడు. అందుకే విడుదల తేదీ ప్రకటించడానికి ముందే ‘కేజీఎఫ్ 2’ దర్శక నిర్మాతలు, హీరోకు తన పరిస్థితిని వివరిస్తూ క్షమాపణలు కోరానని చెప్పాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుని.. అదే రోజు సినిమా విడుదల చేసుకోవచ్చని ‘కేజీఎఫ్ 2’ మూవీ మేకర్స్ ఆల్ ది బెస్ట్ చెప్పారని అమీర్ తెలిపారు.