- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యారోగ్యశాఖలో స్కూళ్ల ‘టెన్షన్’
దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలలు ప్రారంభంతో వైద్యారోగ్యశాఖకు వైరస్ టెన్షన్ పట్టుకున్నది. ఈ రోజు నుంచి విద్యార్థులంతా గ్రూప్ గేదర్ అవుతుండటంతో కరోనా వ్యాప్తి చెందుతుందేమోనని ఆఫీసర్లు పరేషాన్ అవుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ చిన్నారులపై అత్యధిక ప్రభావం చూపుతుందని అనేక సర్వేలు సూచిస్తుండగా, ప్రజలతో పాటు అధికారుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. టీకా వేసుకున్న పెద్దలే భయపడుతున్న తరుణంలో ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోని పిల్లలపై వైరస్ ప్రభావం ఎలా ఉంటుందోనని? అధికారులు భయపడుతున్నారు.
పెద్దలతో పోల్చితే చిన్నారులకు వైరస్ సోకితే తీవ్ర సమస్యలు చవిచూడాల్సి వస్తుందని ఇప్పటికే వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి వివరించింది.కానీ విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో స్కూళ్లు ఓపెన్ చేస్తు్న్నా, ముందస్తు నివారణ చర్యల్లో మాత్రం శూన్యం కనిపిస్తున్నది. విద్య, వైద్య శాఖల మధ్య సమన్వయం లేక ప్రత్యేకంగా కరోనా నియంత్రణ ప్లాన్‌లు లేవీ సిద్ధం చేయలేదు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు పైకి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వైద్యశాఖ చెబుతున్నా, గ్రౌండ్ లెవల్‌లో వాస్తవానికి విరుద్ధంగా కనిపిస్తోంది.
ప్రత్యేక టీంలు అవసరం లేదా..
పిల్లల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పకడ్బందీగా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాల్సిన వైద్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎక్కడికక్కడ కరోనాను అడ్డుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా, పట్టించుకోవడం లేదు. కేవలం గతంలో ఉన్న జిల్లా మానిటరింగ్ సెల్ ఆధ్వర్యంలోనే కొవిడ్ పర్యవేక్షణ కొనసాగనుంది. దీంతో పాటు రోజు వారీగా గ్రౌండ్ లెవల్‌లోని పరిస్థితులపై రివ్యూలు నిర్వహించనున్నట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
నోడల్ కేంద్రంగా నిలోఫర్ …
చిన్నారుల కొవిడ్ నోడల్ సెంటర్‌గా నిలోఫర్ ను సిద్ధం చేశారు. కొవిడ్ సోకిన చిన్నారుల్లో శ్వాస, మల్టీ కాంప్లికేషన్ సమస్యలు ఉంటే ఈ కేంద్రంలో చికిత్సను అందించనున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా బెడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు వైద్యశాఖ చెబుతున్నది. అంతేగాక స్పెషల్ వెంటిలేటర్లు, యాంటీవైరల్ డ్రగ్స్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నది. దీంతో పాటు ప్రతీ జిల్లా ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 25 వేల బెడ్లను చిన్నారుల కొరకు ప్రత్యేకంగా కేటాయించిట్లు అధికారులు స్పష్టం చేశారు.
టెస్టులు, శానిటేషన్ లే మా పరిధి..
కేసులు తేలిన తర్వాత టెస్టులు, శానిటేషన్లే తమ బాధ్యత అన్నట్లు వైద్యశాఖ వ్యవహరిస్తున్నది. కరోనా సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పైగా ఆ చర్యల బాధ్యతలను స్కూళ్లు, పేరెంట్స్ కే అప్పజెప్పడం గమ్మత్తుగా ఉన్నది. ప్రతీ స్కూల్లో థర్మల్ స్ర్కీనింగ్, మాస్కులు, శానిటేషన్ తో పాటు మెడికల్ టీంను అందుబాటులో ఉంచాల్సిన వైద్యశాఖ, అవన్నీ స్కూళ్ల బాధ్యతే అన్నట్లు అనధికారికంగా స్పష్టం చేస్తున్నది. కేవలం కేసులు తేలిన తర్వాతనే వైద్యశాఖ రంగంలోకి దిగుతున్నట్లు వివరిస్తున్నది. కేసులు తేలిన స్కూళ్లు సమాచారం ఇస్తే , ప్రైమరీ కాంటాక్ట్ లకు టెస్టులు చేయడంతో పాటు స్కూళ్లను శానిటేషన్ చేపించనున్నట్లు వైద్యశాఖ పేర్కొన్నది.
25 వేల బెడ్లను సిద్ధం చేశాం: డాక్టర్ జి.శ్రీనివాసరావు, హెల్త్ డైరెక్టర్
థర్ధ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు చిన్నారుల కోసం 25 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేశాం. మౌలిక వసతులు, మందులు కొరత లేకుండా అన్ని ఆసుపత్రులను సిద్ధం చేశాం. మొదటి, రెండో వేవ్‌లతో పోల్చితే ఈ సారి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అలెడ్రీ రెండేళ్లుగా చేసిన ప్రిపరేషన్లతోనే దీన్ని సమర్ధవంతంగా అడ్డుకోవచ్చు. స్పెషల్‌గా యాక్షన్ ప్లాన్‌లు అవసరం లేదు.