ఆర్డర్ చేయకుండానే అమెరికాలో చైనా పార్శిళ్లు

by  |
ఆర్డర్ చేయకుండానే అమెరికాలో చైనా పార్శిళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాను చూసి అమెరికన్లు వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో అగ్రరాజ్యం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా చైనా నుంచి విత్తనాల పార్శిళ్లు అమెరికాలో మిస్టరీకి తెరలేపాయి. ఈ వార్త విన్న ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.

యూఎస్‌లో ఏకంగా 27 రాష్ట్రాల్లో ఈ విత్తనాలు పార్శిళ్లు వచ్చాయి. కానీ, ఎటువంటి ఆర్డర్లు ఇవ్వకుండానే పార్శిళ్లు ఎలా వచ్చాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైరస్ కారణంగా ప్రజలు బిక్కు బిక్కు మంటుంటే.. చైనా బాషాలో ఉన్న విత్తనాల కవర్లపై అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది.

దీంతో ఏకంగా శాస్త్రవేత్తలను రంగంలోకి దించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.ఇవి హానికర విత్తనాలని.. ఎక్కడా కూడా వీటిని నాటొద్దని సైంటిస్టులు చెప్పారు. అంతేకాకుండా ఇతర పంటలను నాశనం చేసేలా ఆ విత్తనాలు ఉండొచ్చని హెచ్చరించారు. ఇక చైనా భాషలో ఉన్న కవర్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.



Next Story

Most Viewed