బోన్ లెస్ పై…కోర్టు బోను ఎక్కాడు

దిశ వెబ్ డెస్క్: బోన్ లెస్ చికెన్…ఈ పేరు వినగానే అందరికి ఒక్కసారిగా నోరూరుతుంది. కానీ ఓ యువకుడు ఆ పేరు వినగానే మండిపడుతున్నాడు. అంతటితో ఆగకుండా దాని పేరు మార్చాలంటూ ఏకంగా కోర్టుకెక్కాడు. ఎవరా వ్యక్తి…ఎందుకా కేసు అనుకుంటున్నారా…అయితే ఈ వార్త చదవండి…

బోన్ లెస్ చికెన్ పేరును మార్చాలని అమెరికాలోని సిటీ కౌన్సిల్ కోర్టులో నెబ్రాస్కాకు చెందిన అండెర్ క్రిస్టెన్సన్ లింకో ల్నీకేసు వేశాడు. బోన్ లెస్ చికెన్ అనేది చికెన్ వింగ్స్ రాదని ఆయన కోర్టుకు తెలిపాడు. అది బ్రెస్ట్ ప్రాంతం నుంచి వస్తుండటం వల్ల అందులో బోన్స్ ఉండే అవకాశం లేదన్నారు. ఇది తెలియని మనం అసత్యాల్లో జీవనం సాగిస్తున్నామన్నారు. అందుకే బోన్ లెస్ చికెన్ పేరు మార్చాలని కోర్టును కోరాడు. పైగా వెట్ టెండర్స్, సాసీ నగ్స్ లాంటి పేర్లను పెడితే బాగుంటుదని కోర్టుకు సూచించారు.

Advertisement