అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. పెళ్లికోసం ఇండియాకు వచ్చి తిరిగిరానిలోకాలకు..!

by Sridhar Babu |   ( Updated:2021-06-18 06:22:16.0  )
narishma-reddy 1
X

దిశ, పెద్దపల్లి : పెళ్లి కోసం అమెరికా నుంచి వచ్చిన నరిష్మారెడ్డి కరోనా బారిన పడింది. ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపడంతో 40 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జీవితాన్ని కరోనా వైరస్ చిదిమేయడంతో ఆనందం వెళ్లివిరియాల్సిన పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన పెండ్యాల రవీందర్ రెడ్డి కుమార్తె నరిష్మారెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఏడేళ్ల కిందట అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో వాళ్లు పెళ్లి కుదర్చడంతో సొంతూరుకు తిరిగొచ్చింది. మే నెలలో పెళ్లి ముహూర్తం అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె కరోనా బారిన పడటం జరిగింది.

అయితే, ఇటీవల కరోనాకు చికిత్స తీసుకున్న ఆమె కోలుకుంది. వైరస్ ఆమె ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపడంతో తిరిగి మళ్లీ అనారోగ్యానికి గురైంది. 40 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. చికిత్స కోసం రూ.50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ అమ్మాయి ప్రాణం దక్కలేదని యువతి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనా నుంచి రికవరీ అయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, రెండవసారి కరోనా సోకడంతో వల్లే మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed