అమీర్‌పేట తహశీల్దార్‌కు కరోనా

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. క్రమంగా ప్రభుత్వ అధికారులు, వైద్యులు, పోలీసులు కరోనా కోరల్లో చిక్కకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట రెవెన్యూ ఆఫీసులో పనిచేస్తున్న తహశీల్దార్ చంద్రకళకు శనివారం కరోనా నిర్దారణ అయ్యింది.దీంతో వెంటనే అప్రమత్తమైన బల్దియా కార్యాలయాన్ని శానిటైజ్ చేసి, అందులోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే తహశీల్దార్ ప్రైమరీ కాంటక్ట్స్‌ను ఛేదించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.

Advertisement