రఘురామకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి

by Mahesh |
రఘురామకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ రఘురామకృష్ణను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు తనను కొట్టారనే ఆరోపణలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. రఘురామకృష్ణ మహానటుడని, తనకు తానే గాయాలు చేసుకొని ఈ కేసు నుండి బయటపడాలని చూస్తున్నాడన్నారు. రఘురామ వెనక ఉన్నది చంద్రబాబేనని, టీడీపీతో కలిసి రఘురామ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు ఎన్నో చేశారన్నారు. అంతేకాకుండా రఘురామకృష్ణ అవినీతికి సబంధించి 46 సీడీలను సీఐడీ అధికారులు న్యాయస్థానానికి సమర్పించారన్నారు. రఘురామకృష్ణతో నిత్యం బూతులు తిట్టించడమే టీడీపీ నేతలకు, ఏల్లో ఛానెళ్లకు అలవాటైందని విమర్శలు చేశారు. రఘురామకృష్ణ అరెస్టుతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు వర్గానికి కంటీమీద కునుకులేకుండా పోయిందన్నారు.


Next Story