గల్వాన్ ఘటనపై చైనా పశ్చాత్తాపం!

by vinod kumar |   ( Updated:2020-08-26 06:02:48.0  )
గల్వాన్ ఘటనపై చైనా పశ్చాత్తాపం!
X

దిశ, వెబ్‌డెస్క్: వాస్తవాధీన రేఖ (LAC) సరిహద్దు వివాదం విషయంలో భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై తాజాగా డ్రాగన్ కంట్రీ స్పందించింది. గాల్వాన్ లోయ ఘటన దురదృష్టకరమని మన దేశంలోని చైనా రాయబారి సన్ వీడాంగ్ బుధవారం వ్యాఖ్యానించారు. గాల్వాన్ లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీడాంగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్న భారత్, చైనాల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన స్పష్టంచేశారు. కాగా, రెండు నెలల కిందట జరిగిన గాల్వాన్ లోయ సరిహద్దు వివాదంలో భారత ఆర్మీ జవాన్లు 21 మంది అమరులైన విషయం తెలిసిందే.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed