- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amazon Youth Offer :రూ.499కే ఏడాది ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలసిందే. లాక్‌డౌన్‌లో సినిమా హాల్లు కూడా మూతపడ్డాయి. ఆ తరువాత లాక్‌డౌన్ ఎత్తివేసినా సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ సినిమా థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో భారీ సినిమాలు సైతం ఓటీటీ బాట పట్టాయి. ముందునుండే ఓటీటీలో పలు రకాల ఆఫర్లతో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ ప్రైమ్ ఇప్పు మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అదేంటంటే.. రూ.999లు ఉన్న అమెజాన్ ప్రైమ్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు రూ.499లకే అందిస్తామని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. అవేటంటే.. 18 ఏళ్ల నుండి 24 ఏళ్ల వయస్సు వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. యువ కస్టమర్లను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తుంది.
ఈ ఆఫర్‌కు అర్హులైన యువత ముందుగా ఏడాది సబ్‌స్క్రిప్షన్ కొరకు రూ.999 చెల్లించి, ఆధార్, పాన్, ఓటర్ ఐడీకార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డ్యాక్యుమెంట్స్‌తో పాటు ఒక సెల్ఫీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన సమాచారం కరెక్ట్ అయితే రూ.500 క్యాష్‌బ్యాక్ మీ అకౌంట్‌లోకి వస్తుంది. ఈ ఆఫర్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌పై కూడా ఉంది. ముందుగా రూ.329లు చెల్లించి మీ డ్యాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తే రూ.165 క్యాష్ బ్యాక్‌గా మీ అకౌంట్‌లో వస్తాయి. అయితే ఈ ఆఫర్ అండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.