గుడ్ న్యూస్: ఇక్కడ అవి ఉచితం.. ఈ అవకాశాన్ని వదులుకోవొద్దు

by Sridhar Babu |   ( Updated:2021-11-01 02:36:04.0  )
Lions-Club
X

దిశ, అమనగల్లు: నియోజకవర్గ స్థాయిలో లయన్స్ క్లబ్ చేపట్టే ఉచిత కంటి వైద్య, ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ కళ్లను దానం చేసి మరొకరికి దృష్టి భాగ్యం కల్పించాలని అని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు మోహన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ సమితి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ ఆదేశానుసారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 25 మందిని పుష్పగిరి సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు పీఆర్ఓ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జూలూరి రమేష్, కార్యదర్శి వెంకటస్వామిల్, సంయుక్త కార్యదర్శి ఎంగలి బాలకృష్ణ, పీఆర్ఓ పాషా, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవి కుమార్, సభ్యులు వెంకటయ్య, కొండల్ రెడ్డి, సూర్య ప్రకాష్, మధుసూదన్ రెడ్డి, కోశాధికారి వెంకట్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed