- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేమేం పాపం చేశాం?: ‘ప్రేమమ్’ డైరెక్టర్
దిశ, సినిమా : ‘ప్రేమమ్’ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్.. దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్స్‌పై ఆంక్షలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించాడు. ఇతర విషయాల్లో సడలింపులిచ్చిన ప్రభుత్వాలు ఫిల్మింగ్ విషయంలో మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నాయని అడిగాడు. పాల వ్యాపారి నుంచి హోటల్ బిజినెస్ వరకు అన్నింటికీ, అందరికీ పర్మిషన్ ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్స్.. ఫిల్మ్ పీపుల్‌కు మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదన్నాడు.
అలాంటప్పుడు మేము డబ్బులెలా సంపాదిస్తాం? ఎలా తింటాం? తమ పిల్లలకు చదువు ఎలా చెప్పిస్తాం? అని ఫేస్‌బుక్ ద్వారా ప్రశ్నించాడు. సినిమా షూటింగ్స్‌లో జనాలు.. థియేటర్స్‌లో మాదిరి గుంపులు గుంపులుగా ఉండరన్న ఆల్ఫోన్స్.. క్లోజ్‌అప్ లేదా వైడ్ షాట్ షూట్ చేయాల్సి వచ్చినప్పటికీ కనీసం రెండు మీటర్ల డిస్టెయిన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుందని గుర్తుచేశాడు. అలాంటప్పుడు షూటింగ్ రెజ్యూమ్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడానికి మీరు ఏ లాజిక్ ఫాలో అవుతున్నారో చెప్పాలన్నాడు. దయచేసి దీనిపై ఆలోచించి పరిష్కారం చూపించాలని కోరాడు.