నలుగురి జీవితాల సమాహారంగా ‘అలాంటి సిత్రాలు’

by Jakkula Samataha |
alanti chitralu
X

దిశ, సినిమా : తెలుగు తెరపై చాలా మంది యవ దర్శకులు సరికొత్త కథలతో ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ సుప్రీత్ సి.కృష్ణ ఓ భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నలుగురు భిన్న మనస్థత్వాలు గల వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అలాంటి సిత్రాలు’. కాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయడం విశేషం.

టీజ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని.. వైవిధ్యమైన క‌థ‌, ఉత్కంఠ‌భ‌రిత క‌థ‌నంతో సినిమా రూపొందింద‌నే న‌మ్మకాన్ని క‌లిగిస్తోందన్న దిల్‌రాజు.. ‘అలాంటి సిత్రాలు’ మంచి విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. ఇక చిత్రంలోని ‘ఒకటి గుర్తు పెట్టుకో.. మనం నాశనమవ్వాలంటే అన్నీ సహకరిస్తాయి. కానీ బాగుపడాలంటేనే వంద అడ్డంకులొస్తాయి. అయినా నీతో తిరిగితే తప్పేంటి? నువ్వొక ప్రాస్టిట్యూట్ అంట. అది కూడా పనే కదా’ అనే సంభాషణలు హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. శ్వేతా పరాశర్, యష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతు ఓంకార్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఐ అండ్ ఐ ఆర్ట్స్ కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాహుల్ రెడ్డి నిర్మిస్తుండగా, ప్రముఖ జర్నలిస్ట్ కె. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి చివరి వారంలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Advertisement

Next Story