కరోనాను గెలిచిన స్టైలిష్ స్టార్.. పిల్లలతో ఇలా

by Shyam |   ( Updated:2021-05-12 06:06:12.0  )
కరోనాను గెలిచిన స్టైలిష్ స్టార్.. పిల్లలతో ఇలా
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 15 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న బన్నీ వైరస్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు.ఇటీవల ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తానూ కోలుకోవాలని ప్రార్దించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అందరు ఇళ్లలోనే ఉండాలని కోరాడు. ఇక 15 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ తర్వాత బన్నీ తన పిల్లలిద్దరినీ ప్రేమగా దగ్గరకు తీసుకుని వారితో సరదాగా ఆడుకున్నాడు. వార్ లో గెలిచిన వారియర్ లా బన్నీ అలా నడుచుకొంటూ వెళ్లి కొడుకు అయాన్ ని, కూతురు ఆద్యను హత్తుకొని ముద్దులు కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట మారింది. ఇకపోతే ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed