- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగార్జున కొడుకు విషయంలో నేనూ సలహా ఇచ్చాను, కానీ – అల్లు అర్జున్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. కరోనాతో అల్లకల్లోలంగా మారిన చిత్రపరిశ్రమ ఇప్పడిప్పుడే నిలదొక్కుకొంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు, స్టేజిపై హీరోల సంచలన వ్యాఖ్యలు అన్నింటిని మిస్ అయిన ప్రేక్షకులు.. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు హిట్ కొట్టడంతో మళ్లీ వాటికోసం ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడం, దాని సక్సెస్ మీట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రావడం, అఖిల్ తో తనకున్న అభిమానం గురించి ఎంతో చక్కగా చెప్పాడు. ప్రస్తుతం బన్నీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సక్సెస్ మీట్ లో బన్నీ మాట్లాడుతూ నాగార్జునను కలిసి అఖిల్ గురించి సలహా ఇచ్చారని చెప్పారు. అఖిల్ తనకు తమ్ముడులాంటివాడని, తన డ్రెస్సింగ్ స్టైల్ తనకు బాగా నచ్చుతుందని అన్న బన్నీ గతంలో అఖిల్ గురించి నాగార్జునతో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశాడు. ఒకరోజు నాగార్జున ఇంటికి వెళ్లినప్పుడు.. అఖిల్ ను ఎలా లాంఛ్ చేయాలన్న దానిపై ఆయనకే సలహాలు ఇచ్చానని, అఖిల్ అంటే అంత అభిమానమని తెలిపారు. ప్రస్తుతం బన్నీ మాటలు అందరిని షాకింగ్ కి గురిచేస్తున్నాయి. నిజం చెప్పాలంటే .. టాలీవుడ్ మొత్తంలో నాగార్జున అంతటి మోస్ట్ క్యాలిక్యులేటెడ్ హీరో కానీ, బిజినెస్ మ్యాన్ కానీ లేరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి నాగ్ దగ్గరకి వెళ్లి ఆయన కొడుకు లాంఛింగ్ విషయంలోనే బన్నీ సలహాలు ఇవ్వడమంటే మాటలు కాదు అని అభిమానులు నోరు నొక్కుకుంటున్నారు. మరి ఏదైనా బన్నీ గట్స్ అలాంటివి అని మరొకొందరు కామెంట్స్ చేస్తున్నారు.