పూరీ డైలాగ్స్‌కు బన్నీ ఫిదా!

by  |
పూరీ డైలాగ్స్‌కు బన్నీ ఫిదా!
X

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు. ఇన్నాళ్లు హీరోల చేత పక్కా మాస్ డైలాగ్స్ చెప్పించిన పూరీ.. ఇప్పుడు తానే పంచ్ డైలాగ్స్ చెబుతూ ‘క్యా బాత్ హై’ అనిపించుకుంటున్నాడు. పాడ్‌కాస్ట్ ద్వారా జీవిత సత్యాలను డైలాగ్స్‌గా చెబుతున్న పూరీని శభాష్ అని మెచ్చుకున్నారు బన్నీ.

‘పూరీ గారు.. మీ డైలాగ్స్ నిజమైన జీవిత సత్యాలు, అద్భుతంగా ఉన్నాయని’ చెప్పారు. పూరీ కంటెంట్ బాగా నచ్చిందన్న బన్నీ.. ఇలాంటివి మరిన్ని చర్చించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన పూరీ.. ‘థాంక్స్ బన్నీ నీలాంటి యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ యాక్టర్‌కు నా ఆలోచన నచ్చడం ఆనందంగా ఉంది. నీ కాంప్లిమెంట్స్‌తో సంతోషంలో ఈ రోజు ఎక్స్‌ట్రా పెగ్ వేస్తా’ అని చెప్పాడు పూరీ.

కాగా పూరీ డైరెక్షన్‌లో వచ్చిన ‘దేశ ముదురు’ సినిమాతోనే బన్నీ మాస్ హీరోగా మారాడు. పూరీ మార్క్‌తో మాస్ యాంగిల్‌లో కనిపించి, ప్రేక్షకులను మెప్పించిన కథానాయకుల లిస్ట్‌లో బన్నీ కూడా ఒకరన్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed