కథ మెచ్చిన బన్నీ..

by  |
కథ మెచ్చిన బన్నీ..
X

కంటెంట్ కొత్తగా ఉంటే చాలు.. అతడు స్టార్ డైరెక్టరా.. న్యూ డైరెక్టరా ! అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు స్టార్ హీరోలు. కమర్షియల్ హంగులు జోడించి మంచి మెసేజ్ ఇచ్చే కథ ఉంటే కళ్లు మూసుకుని ఆఫర్ ఇచ్చేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్తగా వచ్చిన దర్శకుడి కథ మెచ్చి చాన్స్ ఇచ్చినట్లు సమాచారం. యాత్ర టైటిల్‌తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కించిన డైరెక్టర్ మహి వి రాఘవకు బన్నీని డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చినట్లు టాలీవుడ్ టాక్.

ఇటీవల అల్లు అర్జున్‌ను కలిసిన రాఘవ.. స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొంచెం కొత్తగా ఉన్న స్టోరీకి ఇంప్రెస్ అయిన బన్నీ.. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమా చేస్తున్న బన్నీ.. తర్వాతి ప్రాజెక్ట్ యాత్ర డైరెక్టర్‌తోనే చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి మహి రెండో సినిమాకే బన్నీని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు అంటున్నారు విశ్లేషకులు.


Next Story

Most Viewed