- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల కరోనా బారిన పడ్డారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్వయంగా అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్నాక, ముగ్గురు స్నేహితులం ఊరెళ్లామని, తిరిగొచ్చిన తర్వాత తనకు, మరో వ్యక్తికి స్వల్పంగా జ్వరం వచ్చిందని, మరో మిత్రుడు ఆసుపత్రిపాలయ్యాడని వివరించారు.
వ్యాక్సిన్ తీసుకున్న నేను, మరో వ్యక్తి తేలికపాటి జ్వరానికి గురయ్యామన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తి మాత్రం ఆసుపత్రిలో చేరాడన్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల ప్రాణహాని ఉండదని తెలిపారు. కరోనా ప్రభావం కూడా మనిషి శరీరంపై ఏమంత ఎక్కువగా ఉండదన్నారు. “వైరస్ వచ్చి పోతుందంతే. వ్యాక్సిన్ వేయించుకోబట్టే నాకు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరంలేకపోయింది. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి. అప్పుడు కరోనా వచ్చినా ఏమీ చేయదు” అని వివరించారు. ఈ మేరకు అల్లు అరవింద్ ఓ వీడియో విడుదల చేశారు.