ఇంజనీరింగ్ కోర్సుల‌కు తుది విడత సీట్ల కేటాయింపు

by Shyam |
Colleges of Engineering
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంజనీరింగ్​కోర్సులకు తుది విడుత సీట్ల కేటాయింపు శుక్రవారం పూర్తయింది. కాగా 15 ఇంజనీరింగ్​ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్​విభాగంలో 59,993 సీట్లు భర్తీకాగా, 19,797 సీట్లు మిగిలినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఫార్మసీ కోర్సుకు ఆదరణ కరువైంది. ఫార్మసీలో 4,426 సీట్లు, ఫార్మ్​డీలో 221 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తుది విడుత సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 15వ తేదీలోగా ఆన్​లైన్​లో సెల్ఫ్​రిపోర్టింగ్​చేయాలని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో 90 శాతానికి పైగా సీట్లు భ‌ర్తీ అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే మెకానిక‌ల్‌ ఇంజనీరింగ్​కోర్సులో 32.57 శాతం సీట్లు, సివిల్‌లో 41.87 శాతం, ఈఈఈలో 46.14 శాతం సీట్లు మాత్రమే భ‌ర్తీ అయ్యాయి. ఈ మూడు కోర్సుల‌కు ఆద‌ర‌ణ త‌గ్గినా సీఎస్ఈలో 95.98 శాతం, ఐటీలో 94.13 శాతం, సీఎస్ఈ(ఏఐ, ఎంఎల్)లో 85.68 శాతం, డేటా సైన్స్‌లో 91.52 శాతం సీట్లు భ‌ర్తీ కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed