వాళ్లకు టిడ్కో ఇండ్లు అందించండి: మంత్రి అవంతి

by srinivas |
వాళ్లకు టిడ్కో ఇండ్లు అందించండి: మంత్రి అవంతి
X

దిశ,విశాఖపట్నం: విశాఖ నగర పరిధిలోని ఎనిమిది నియోజక వర్గాల్లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ టిడ్కో ఇండ్లను కేటాయించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ గ్రేటర్‌ అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌ విశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, జోనల్‌ కమిషనర్లు, హౌసింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విశాఖ నగర పరిధిలో 3.5లక్షల ఇండ్ల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో 2.5లక్షల మందిని అర్హులుగా గుర్తించామని, మిగిలిన లక్షమందికి కూడా వారి అవసరాలను గుర్తించి త్వరితగతిన ఇళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆశయం మేరకు అర్హులైన వారందరకీ సకాలంలో ఇండ్లు అందించాలన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చేనెల రెండో తేది వరకూ ఇండ్ల పట్టాల పంపిణీ పండగ అన్ని గ్రామాల్లో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed