ఆహా.. ‘ఆల్ ఈజ్ వెల్ విత్ సుమ’

by Jakkula Samataha |   ( Updated:2023-06-07 12:56:46.0  )
ఆహా.. ‘ఆల్ ఈజ్ వెల్ విత్ సుమ’
X

పని మనిషి ఇంటికిరాక ఐదు నెలలవుతోంది.. పగలు, రాత్రి తేడా లేకుండా పోతోంది. 24 గంటలు ఇంట్లోనే ఉండిపోతున్నాం. మాస్క్ లేకుండా అసలు బయటికి వెళ్లలేకపోతున్నాం.. చక్కగా రెడీ అయి ఎన్ని రోజులైందో.. ఎవరైనా తుమ్మినా, దగ్గినా భయమేస్తుందే బాబు.. హైదరాబాద్ బిర్యానీ తిని ఎంత కాలం అయిందో.. మీరూ ఇలాగే అనుకుంటూ ఉంటారు కదా..! కానీ ఏం చేస్తాం కరోనా పుణ్యమాని ఇలాంటి గతి పట్టింది. సర్లే మనం మాత్రం ఏం చేస్తాం.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటూ ముందుకు సాగాల్సిందే.. ఆల్ ఈజ్ వెల్ చెప్పుకుంటూ జీవన ప్రయాణం సాగించాల్సిందే.

అయితే ఈ ప్రయాణంలో మిమ్మల్ని అలరించేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’.. ఆహా అనేలా ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. ‘ఆల్ ఈజ్ వెల్ విత్ సుమ’ పేరుతో సూపర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతోంది. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షోలో నవ్వులే నవ్వులు అంటూ.. వచ్చేస్తున్న ప్రోగ్రామ్ కోసం రెడీగా ఉన్నారా అంటూ ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. ఇప్పటికే బుల్లితెర మహారాణిగా నీరాజనాలు అందుకున్న సుమక్క.. ఈ షో ద్వారా డిజిటల్ మీడియాకు ఎంట్రీ ఇచ్చేస్తోంది. అఫ్‌కోర్స్ ఈ షో కూడా సక్సెస్ కాబట్టి, సుమక్క నుంచి మరిన్ని షోస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.

Advertisement

Next Story