‘థియేటర్స్ తెరవడానికి అనుమతివ్వండి’

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా థియేటర్లు మూసి వేసిన విషయం తెలిసిందే. కాగా మళ్లీ థియేటర్లు తెరిచే ప్రయత్నంలో మంగళవారం ఆలిండియా సినీ ఇండస్ట్రీ సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ, సమాచార కార్యదర్శులతో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లు తెరవాలని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆలిండియా ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు హాసన్ పాల్గొన్నారు.

తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు సి. కళ్యాణ్ హాజరయ్యారు. రైళ్లు, మెట్రో సర్వీసులు, విమానాలకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో… థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడపటానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement