గాజులపేటలో హై అలర్ట్

by Aamani |   ( Updated:2020-04-06 02:20:42.0  )
గాజులపేటలో హై అలర్ట్
X

దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని గాజులపేటలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ సోమవారం పర్యటించారు. కరోనా నివారణకు ప్రతి ఇంటిలో బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేయాలని, సోడియం హైపోక్లోరైట్ రోడ్లపై చల్లాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. గాజులపేటవాడ నుంచి 500 మీటర్ల పరిధిలో ప్రజలు ఎవరు కూడా బయటకు రాకుండా చూడాలని, కిరాణా దుకాణాలు అన్నీ మూసి వేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ బైల్ బజార్ లోని కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. ప్రజలు మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని సూచించారు. కలెక్టర్‌తో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యన్. బాలకృష్ణ, జిల్లా కరోనా నియంత్రణను నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్

తదితరులు ఉన్నారు.

Tags: Nirmal,collector,Musharrf pharukhi,Hi allert

Advertisement

Next Story