- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఛీ ఛీ ఇంతకన్నా నీచం ఉంటుందా.. స్టేషన్‌లోనే సెక్స్ చేయమని పోలీసుల దాష్టీకం
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు ఇలాంటి ఫిర్యాదును ఎక్కడా, ఎవరు చేసి ఉండరేమో.. పోలీసుల మీదనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం సృష్టిస్తోంది. విచారణ సమయంలో తమను ఏడుగురు పోలీసులు చిత్రహింసలకు గురిచేసారని తెలుపుతూ ఇద్దరు నిందితులుపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన జార్ఖండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. మహ్మద్ అర్జూ, మహ్మద ఔరంగజేబు అనే ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ కేసులో అనుమానితులుగా భావించి పోలీసులు అరెస్ట్ చేసి ఆగస్టు 24న కద్మా పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. అనంతరం ఆగస్టు 26న విచారణ పేరుతో వారిని చిత్ర హింసలకు గురిచేశారు. తీవ్రంగా కొడుతూ నిజం ఒప్పుకోవాలని వేధించి సాయంత్రం లోపు పంపించేశారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఆగస్టు 27న జంషెడ్‌పూర్ ఎస్‌ఎస్‌పి తమిళ వనన్ వద్దకు వెళ్లి పోలీసులపై ఘాటు ఆరోపణలు చేశారు. “మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారు.. ఆ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ ఇన్‌ఛార్జి మనోజ్ కుమార్ ఠాకూర్ తో పాటు మరో ఏడుగురు పోలీసులు ఉన్నారు. ముందు మా బట్టలు విప్పి, నగ్నంగా నిలబెట్టి కొట్టారు.. అనంతరం మా ఇద్దరినీ సెక్స్ చేసుకోమని ఫోర్స్ చేశారు. మేము చేయమని చెప్పడంతో మమ్మల్ని చితకబాదారు. ఆఫ్ఘనిస్థాన్ పంపిస్తామని బెదిరించారు” అని ఫిర్యాదు చేయడంతో షాక్ తిన్న అధికారులు వారికి మెడికల్ టెస్టులు నిర్వహించగా.. అందులోనూ దాడికి పాల్పడినట్లు తేలింది.. ఇక దీంతో జంషెడ్‌పూర్ ఎస్‌ఎస్‌పి తమిళ వనన్ ఈ అంశంపై వ్యాఖ్యానించకపోవడం విశేషం.
మరోపక్క ఈ ఫిర్యాదుపై ఇన్‌ఛార్జి మనోజ్ కుమార్ ఠాకూర్ స్పందిస్తూ తాము అలాంటి పనులు చేయమని చెప్పలేదని, విచారణ నిమిత్తం కొట్టిన విషయం వాస్తవమే కానీ, సెక్స్ చేసుకోండి అనే వార్త అసత్యమని అన్నారు. వారెందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో అనేది తనకు తెలియదని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు స్థానికంగా సంచలనంగా మారింది. ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన ఆరోపణలు నిజమైతే పోలీస్ వ్యవస్థపై ఉన్న కొద్దో గొప్పో నమ్మకం పూర్తిగా పోతుందని, ఇంతకన్నా నీచం మరేదీ ఉండదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow Disha daily Official Facebook page: https://www.facebook.com/dishatelugunews