- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెంకటేశ్వరా.. సాయి లీలలు నీవే కనవయా..!!
దిశ, నేరేడుచర్ల : విద్యుత్ శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే ఆ శాఖలో ఓ కింది స్థాయి అధికారి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తోటి ఉద్యోగుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న తండ్రి చనిపోవడంతో అటెండర్‌గా జాయిన్ అయిన ఆయన.. నేడు మండల స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తూ.. అధికారులను శాసించే స్థాయికి ఎదిగాడు. ఆయనకు జిల్లా స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉండడంతో సదరు ఉద్యోగి ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. అతడిపై ఏ అధికారైన ధైర్యం చేసి పై అధికారులకు ఫిర్యాదు చేస్తే అతడి పోస్ట్ ఖాళీ అయినట్టే. ఇంతకూ ఎవరా అధికారి అనుకుంటున్నారా..? జిల్లాలోని మారుమూల మండలమైన పాలకీడులో విధులు నిర్వహిస్తున్నాడీ ఫైరవీకారి.
అన్నీ ఆయన అండదండలతోనే..
సదరు అధికారి పాలకీడు మండలం విద్యుత్ శాఖలో సెకండ్ స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన చదివిన చదువుకు ఏమాత్రం అర్హత లేని పోస్ట్ చేస్తున్న ఆయన.. ఎక్కడ మండలస్థాయి పోస్టు ఖాళీగా ఉంటే అక్కడికి బదిలీపై వెళ్లడం ఆ అధికారి నైజమట. ఎక్కడ పని చేసినా ఆఫీసుల్లో అధికారులను లెక్కచేయకుండా అన్నీ తానై వ్యవహరించడం పట్ల ఆ శాఖ అధికారులు ఆగ్రహం చేస్తున్నారు. ఈ మండల స్థాయి అధికారికి జిల్లా స్థాయిలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓ ఉన్నతాధికారి నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని విద్యుత్ అధికారుల ఆరోపణ. ఆయన అండదండలతో ఈ మండల అధికారి.. అధికారులతోపాటు కార్యాలయానికి వచ్చే రైతులను తీవ్ర ఇబ్బందులు పెడతాడని తీవ్ర విమర్శలు ఉన్నాయి.
ఎక్కడ పోస్టు ఖాళీగా ఉంటే అక్కడ ప్రత్యక్షం..
విద్యుత్ శాఖలో ఏ మండలంలో ఏ పోస్ట్ ఖాళీగా ఉంటే ఆ స్థాయి అధికారి జాయిన్ అయ్యి విధులు నిర్వహించాలి. కానీ ఈ సెకండరీ స్థాయి అధికారి ఎక్కడ మండలస్థాయి పోస్ట్ ఖాళీగా ఉంటే అక్కడ పనిచేసే సెకండ్ స్థాయి అధికారిని మరో చోటుకు బదిలీ చేయించి అక్కడ తిష్ట వేస్తాడనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా మునగాల, నేరేడుచర్ల మండలాల్లో జరిగిందని ఆ శాఖ ఉద్యోగుల చెబుతున్నారు. పాలకవీడులో కూడా మండల స్థాయి అధికారి రెండేళ్లు సెలవులపై వెళ్లడంతో ఆ అధికారి ప్లేస్ లో ఈ సెకండరీ క్యాడర్ అధికారి డిఫ్యుటేషన్ పై వచ్చాడని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఆయన జాయినింగ్ నాటి నుంచి నేటి వరకు ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారి ఎక్కడ పని చేసినా అతినీతి ఆరోపణలు రావడం పరిపాటిగా మారింది. ఆయన పని తీరుపై ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉద్యోగులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
ఆ అధికారిపై వచ్చిన ఆరోపణల్లో మచ్చుకు కొన్ని..
* ఈ అధికారి డబ్బులు తీసుకోకుండా ఏ పని చేయడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలు లేకుండా ఏ స్థాయి ప్రజాప్రతినిధి చెప్పినా వినడనే విమర్శలు ఉన్నాయి. కనీసం వారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడని పలువురు ప్రజాప్రతినిధులు మండల సర్వసభ్య సమావేశాల్లోనూ ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.
* ట్రాన్స్‌ఫార్మర్ల కోసం డీడీలు కడితే వాటితోపాటు అదనంగా మరో రూ.20వేలు అదనంగా ఇస్తేనే ఆ ఫైల్ ముందుకు కదులుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.
* నేరేడుచర్ల మండలం మేడారంలో 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ను పాలకవీడు మండలంలోని గుండెబోయినగూడెంకు చెందిన రైతులకు అక్రమంగా అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి.
* పాలకీడు మండలంలోని కోమటికుంటలో కాలిపోయిన 10 కేవీ ట్రాన్స్ ఫార్మర్‌ను తీసుకెళ్లి కల్మడ్ తండా రైతులకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి .
* నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త ట్రాన్స్‌ఫార్మర్ కావాలని వెళ్లగా.. రూ.20 అదనంగా తీసుకుని ఇచ్చినట్లు సమాచారం.
* జాన్ పహాడ్‌లో ఓ పెట్రోల్ బంక్‌కు కరెంటు అనుమతుల కోసం రూ.40 వేలు తీసుకున్నట్లు సమాచారం
* బోత్తలపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు తనకు ట్రాన్స్ఫార్మర్ కావాలని నాలుగు డీడీలు తీసుకుని వెళ్లగా రూ.40 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ముందస్తుగా రూ.20 వేలు సమర్పించుకున్నారు. కానీ ఇప్పటికీ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో ఆ రైతుకు, అధికారి మధ్య వివాదం జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
* రావిపహాడ్ గ్రామంలో 2020లో వచ్చిన కృష్ణా నది వరదలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, కరెంటు స్తంభాలు నీటిలో మునిగి మరమ్మతులకు గురయ్యాయి. వాటి పునరుద్ధరణ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. మొదటి దఫా రూ.50 వేలు లంచంగా ఇచ్చామని బాధిత రైతులు వాపోతున్నారు.
* రావి పహాడ్ గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన రెండు గేదెలు విద్యుదాఘాతంతో మృతి చెందగా.. నష్ట పరిహారం చెల్లించేందుకు రూ.10 వేలు తీసుకున్నాడని సమాచారం.
ఇలా ఏ పని చేయాలన్నా ఉచితంగా చేయడనే విమర్శలు సదరు అధికారిపై వెల్లువెత్తుతున్నాయి. వీటిపై సాహసం చేసి ఫిర్యాదు చేసినా జిల్లా అధికారి అతడిని కాపాడుతూ వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నాయి.