గంగవ్వ.. నా ఓటు నీకే!

by  |
గంగవ్వ.. నా ఓటు నీకే!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘తెలుగు ప్రజలకు ఒక వ్యక్తి నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు..’ అంటే సినిమా డైలాగ్ అనుకున్నాం. కానీ ఇది నూటికి నూరు శాతం నిజమనిపిస్తోంది. నెవర్ బిఫోర్ ఎంటనర్‌టైన్మెంట్‌తో ‘బిగ్ బాస్ సీజన్ 4’ షురూ కాగా.. 16 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోలో ముగ్గురు నలుగురు తప్పితే అంతగా వెల్ సెటిల్ అవ్వని యంగ్‌స్టర్స్‌ను సెలక్ట్ చేసి ఓ బిగ్ ప్లాట్‌ఫామ్ ఇచ్చింది బిగ్‌బాస్. కానీ వీరందరిలో వెరీ వెరీ వెరీ స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు యూట్యూబర్ గంగవ్వ.

58 ఏళ్ల పైబడిన గంగవ్వ ఎంట్రీతో.. ఇంట్లో ‘బిగ్ బాస్ సీజన్ 4’ చూస్తున్న ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉందంటే? ధోనీ పాకిస్థాన్ మీద హెలికాప్టర్ షాట్ కొడితే గ్రౌండ్‌లో ఎలాంటి వాతావరణం నెలకొంటుంది? మెగాస్టార్ బిగ్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తే థియేటర్స్‌ ఎలా దద్దరిల్లుతాయి?.. అచ్చం అలాగే. చాలా ఇన్నోసెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఏవీ చూసిన ప్రతీ ఒక్కరు కన్నీరు పెట్టుకుంటూనే.. ఆమె స్ఫూర్తికి ఖుదోస్ చెప్పారు. బిగ్ ఇన్స్‌పిరేషన్ లేడీకి బిగ్ బాస్ ద్వారా బిగ్ స్టేజ్ దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు.

అంతే ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. నా ఓటు నీకే గంగవ్వా అంటూ.. సోషల్ మీడియాలో ‘గంగవ్వ’ పేరుతో ట్రెండ్‌కు తెరలేపారు. ట్విట్టర్‌ ఇండియా ట్రెండింగ్‌లో ‘బిగ్ బాస్ 4 తెలుగు సీజన్’ టాప్‌లో ఉంటే.. ఆ తర్వాత గంగవ్వ పేరు సెకండ్ ప్లేస్‌లో ఉందంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది సరే.. ఇంత మందిని ఇన్‌స్పైర్ చేసింది సరే.. మరి హౌస్‌లో ఎలా ఉంటుంది? బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు కంప్లీట్ చేసే స్టామినా ఉందా? హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే గంగవ్వ చెప్పిన మాట కూడా ఇదే.. అసలే చాతగాని దాన్ని బిడ్డా! అని. అలా అయితే నామినేషన్స్‌లో నిలుస్తుంది కదా? బిగ్ బాస్ ఏమైనా ఎక్స్‌క్యూస్ చేస్తాడా? లేక రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అంటాడా? అంటే.. ‘అననీయ్.. బిగ్ బాస్‌కు మించిన బాస్‌లు ప్రేక్షకులే కదా.. విన్నర్‌ను డిసైడ్ చేసేది మనమేగా.. చలో గంగవ్వకు ఓటేద్దాం.. బిగ్ బాస్ 4 లేడీ బాస్‌గా నిలబెడదాం.. అని’ నిర్ణయించేసుకున్నారు.

తనదైన యాసతో గంగవ్వ ఎంటర్‌టైన్మెంట్ మొదలుపెట్టిందో లేదో.. గంగవ్వ ఆర్మీ రెడీ అయిపోయింది. ‘ఏం భయపడకు గంగవ్వా.. నీకు మేమున్నాం.. నువ్వు ఎలాగూ లైఫ్‌లో గెలిచావ్.. బిగ్ బాస్ 4 కూడా గెలుస్తావ్’ అని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఒక వ్యవసాయ కూలి నుంచి యూట్యూబర్‌గా.. అక్కడి నుంచి బిగ్ బాస్ కంటెస్టంట్‌గా సాగుతున్న గంగవ్వ ప్రయాణం.. బిగ్ బాస్ విన్నర్‌గా ఎండ్ అవుతుందా? చూడాలి. ఎనీ వే ఆల్ ది బెస్ట్ గంగవ్వ.


Next Story

Most Viewed