- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నిర్ణయాన్ని తెలుగువారంతా వ్యతిరేకిస్తున్నారు
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు అకాడమి పేరును తెలుగు, సంస్కృత అకాడమిగా మార్చడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యావత్ ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సోమవారం తెలుగు అకాడమి పేరు మార్పుపై కీలక అంశాలను ప్రస్తావిస్తూ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ రాశారు. ప్రభుత్వం ఏకపక్షంగా తెలుగు అకాడమి పేరు మార్చిందని ధ్వజమెత్తారు. ఇలాంటి నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం సరికాదని ప్రజలు, నిపుణుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
ఏ సమస్యనైనా ఒకే కోణం నుంచి మాత్రమే చూసే మీకు రెండో కోణం గురించి చెప్పేందుకే తాను ప్రయత్నిస్తున్నానని ఎంపీ రఘురామ సీఎం జగన్‌కు లేఖలో తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తెలుగు అకాడమిని చులకన చేయడం ద్వారా తెలుగు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారో తనకు అర్థంకావడం లేదన్నారు. ప్రాథమిక విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలని నిర్ణయించినప్పుడే మీరు తెలుగు భాషను తుడిచిపెట్టే సాహసం చేస్తున్నారని భావించానన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు.
తాజాగా తెలుగు అకాడమిలో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. సంస్కృతానికి పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పడం చూస్తుంటే తల్లికి అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు పట్టుచీర తెచ్చాడన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.