సీఎం కేసీఆర్‌కు అఖిలపక్షం బహిరంగ లేఖ

by Shyam |
సీఎం కేసీఆర్‌కు అఖిలపక్షం బహిరంగ లేఖ
X

దిశ, న్యూస్‌బ్యూరో: జీవో నెంబర్ 45ఆధారంగా ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలపై జోక్యం చేసుకొని బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిలపక్ష నాయకులు చాడ వెంకటరెడ్డి, కోదండరాం, ఎల్. రమణలు గురువారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలపై ఆధారపడి 1లక్షా 25వేల మంది జీవిస్తున్నారని తెలిపారు. వీరే కాకుండా బోధనేతర సిబ్బంది కూడా ఉన్నారని, కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ అమలు నుంచి యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదని వారందరినీ ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed