చట్టసభల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత..

by Shyam |
చట్టసభల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరగాల్సిన అవసరాన్ని తెలిపేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టానికి అసెంబ్లీలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి సవరణలు ప్రవేశ పెట్టడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చట్ట సవరణలో మహిళలకు తగిన ప్రాధాన్యతనివ్వడం స్వాగతించదగిన అంశమని పలువురు పార్టీలకతీతంగా అభినందనలు తెలుపుతున్నారు. కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత ఇక తమకు తిరుగు లేదని ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి చట్టసవరణ చెంప పెట్టులాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమముతున్నాయి. 1955లోనే జీహెచ్ఎంసీ ఏర్పడినప్పటికీ నాటి నుంచి నేటి వరకు మంత్రి కేటీఆర్ తీసుకున్న ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం గతంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తీర్మానం ముఖ్య అంశాలు ఇవే..

జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ప్రతీ డివిజన్లలో నాలుగు చొప్పున వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తారు. యువత, మహిళలు, సీనియర్ సిటీజెన్స్, నిపుణులు ఇలా నాలుగు కమిటీలు ప్రతి డివిజన్ లో ఏర్పాటు చేస్తారు. ఒక్కో కమిటీలో 25 మంది సభ్యులకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. వీరిలో కూడా 50 శాతం మహిళలకు స్థానం కల్పించడం తప్పనిసరి. ఈ కమిటీలు ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై అధికారులు , ప్రజా ప్రతినిధుల పనితీరుపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. పనితీరు సక్రమంగా లేని వారిని అవసరమైతే రీ కాల్ చేస్తారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణలో మహిళా సాధికారతకు పెద్ద పీట వేశారు. మొత్తం 150 డివిజన్లలో సగం డివిజన్లు మహిళలకు కేటాయించనున్నారు. ఇప్పటి వరకు 2.5 శాతం హరితహారానికి నిధులు కేటాయింపు జరుగుతుండగా, ఇకపై 10 శాతం నిధులు కేటా యించి నగరంలో పచ్చదనం పెంచేం దుకు చర్యలు తీసుకుంటారు. జీహెచ్ఎం సీ పరిధిలోని డివిజన్ల రిజర్వేషన్లను రెండు పర్యాయాలు కొనసాగిస్తారు. త్వరలో జరిగే మహా నగర పాలక సంస్థ ఎన్నికలకు మార్పులు చేసిన చట్టం వర్తిస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

100 మందికి అవకాశం..

ప్రతీ డివిజన్ లో నాలుగు వార్డు కమిటీలు ఏర్పాటు చేసి ఒక్కో కమిటీలో 25 మంది చొప్పున మొత్తం 100 మందికి డివిజన్ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించారు. డివిజన్ అభివృద్ధికి వారి సలహాలు ఎంతగా నో ఉపయోగపడుతాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, హరితహారం నిధులు పెంపు వంటివి గ్రేటర్ వేగంగా అభివృద్ధి చెందేందు కు దోహదపడతాయి.

–ప్రేమ్ సింగ్ రాథోడ్, గోషామహల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్​చార్జి

రిజర్వేషన్లు పొడిగింపుపై సంతోషం..

ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరగాల్సిన అవ సరం ఉంది.రిజర్వేషన్ల కేటాయింపు ఐదేళ్లకోసారి మా రడంతో జవాబుదారీతనం ఉండ డం లేదని, దీన్ని 10 ఏళ్లకు పొడిగి స్తే జవాబుదారీతనం పెరుగుతుం ది. జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్లు రెండు పర్యాయాలు కొనసాగేలా చట్ట సవరణ చేయడం అభినందనీయం.

–మమతా సంతోష్ గుప్తా, గన్ ఫౌండ్రి కార్పొరేటర్

చాలా మంచి నిర్ణయం..

మహిళా సాధికారతకు కట్టుబడి స్థాని క సంస్థల ఎన్నిక ల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సవరణ తీసుకువచ్చింది. రాష్ట్రంలో హరితహారం నిధులు 10 శాతం వరకు పెంచడం సరైంది. నగరం కాంక్రీట్ జంగల్ గా మారుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మంత్రి కేటీఆర్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాటిన మొ క్కల్లో 85 శాతం మొక్కలు దక్కేలా జవాబుదారీ తనం పెరగాలని, దానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడం కూడా ఉపకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

–సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ ఇన్​చార్జి నాంపల్లి నియోజకవర్గం

Advertisement

Next Story

Most Viewed