- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక నుంచి మనది మనమే… : అమిత్ షా
న్యూఢిల్లీ: దేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి స్థానిక ఉత్పత్తులనే వినియోగించాలని, ప్రమోట్ చేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి దేశంలోని అన్ని పారామిలిటరీ బలగాలకు చెందిన క్యాంటీన్‌లలో కేవలం స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే అందుబాటులో ఉంటాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును దృష్టిలో పెట్టుకునే సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) క్యాంటీన్‌లు స్థానిక ఉత్పత్తులనే అమ్మాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయంతో దాదాపు 10 లక్షల సీఏపీఎఫ్ సిబ్బందికి చెందిన 50 లక్షల కుటుంబాలు స్థానిక ఉత్పత్తులను వినియోగించబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు, ప్రజలందరూ దేశీయంగా తయారైన ఉత్పత్తులనే వినియోగించాలని కోరుతూ.. ఇతరులూ వాటిని వినియోగించేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి భారతీయుడు స్వదేశీ ఉత్పత్తులనే వాడితే.. ఐదేళ్లలో భారత్ స్వయం సమృద్ధిగా మారుతుందని ట్వీట్ చేశారు. సీఏపీఎఫ్‌లోని సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్ఎస్‌జీ, అస్సాం రైఫిల్స్ బలగాల క్యాంటీన్‌లు ప్రతి సంవత్సరం సుమారు రూ. 2,800 కోట్ల విలువైన ఉత్పత్తులను అమ్ముతున్నాయి.