నా కోరికలన్నీ లోక కల్యాణం కోసమే: జగ్గారెడ్డి

by Shyam |   ( Updated:2021-06-30 06:59:35.0  )
నా కోరికలన్నీ లోక కల్యాణం కోసమే: జగ్గారెడ్డి
X

దిశ, మంగపేట : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం ములుగు జిల్లా సమ్మక్క-సారక్క తాడ్వాయి మండలంలోని వనదేవతలను దర్శించుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చాక మొదటిసారి సమ్మక-సారక్కలను జగ్గారెడ్డి తన కుమారుడు భరత్ సాయిరెడ్డితో కలిసి దర్శించుకున్నారు.

jaggareddy at medaram

ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తమ ఇంటి ఇలవేల్పయిన మేడారం సమ్మక-సారక్క అమ్మవార్లను పది సంవత్సరాలుగా దర్శించుకోవాలనే కోరిన ఇప్పుడు నెరవేరినట్లు తెలిపారు. నిత్యం రద్దీతో ఉండే వన దేవతలను నేడు ప్రశాంతంగా దర్శించుకుని తన మొక్కులు తీర్చుకున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. అమ్మలను మూడు కోరికలు కోరుకోవడం జరిగిందని నేను కోరుకున్న కోరికలన్నీ లోక కల్యాణం కోసమే నన్నారు.

Advertisement

Next Story