సాగర్‌ ఉపఎన్నిక: పోలింగ్‌కు సర్వం సిద్ధం

by Anukaran |
సాగర్‌ ఉపఎన్నిక: పోలింగ్‌కు సర్వం సిద్ధం
X

దిశ, నాగార్జునసాగర్: ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు ఓటు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 346 పోలింగ్‌ కేంద్రాలు, 3,145 మంది ఎన్నికల సిబ్బంది, 2,390 మంది పోలీసులు సిబ్బందిని నియమించారు. సాగర్ వ్యాప్తంగా ఉన్న 346 కేంద్రాల్లో శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. ఆయా కేంద్రాలకు ఇప్పటికే సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో నియమించారు. కొవిడ్‌ నిబంధనలను పటిష్టంగా పాటిస్తూ రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. శానిటైజేషన్, మాస్కులు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోలింగ్‌ 48 గంటల ముందు నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని, 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో కూడా పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు బలగాలు భారీగా మోహరించారు. హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు కూడా ఓటు వేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story