- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలీబాబా .. ఇదెలా సాధ్యం? : హరీశ్ శంకర్

దిశ, వెబ్‌డెస్క్: గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఏ విషయాన్నైనా సామాజిక మాధ్యమంలో షేర్ చేసుకునే ఆయన… ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఈ కామర్స్ కంపెనీ అలిబాబా గ్రూప్‌లో ఓ ఐటెమ్ ఆర్డర్ చేసిన హరీశ్ శంకర్ ఆశ్చర్యపోయారట. తాను కొనాలనుకున్న వస్తువు ధర రూ. 5,608 ఉండగా… షిప్పింగ్ ధర ఏకంగా రూ. 8,801 ఉందట. ఈ విషయాన్నే షేర్ చేసిన డైరెక్టర్… ఇదెలా సాధ్యం అవుతుందని అడిగాడు. నేను ఏమీ ప్రశ్నించట్లేదు జస్ట్ తెలుసుకోవాలని అడుగుతున్నానంతే అంటూ పోస్ట్ పెట్టాడు.
వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దల కొండ గణేష్’ సినిమాతో హిట్ కొట్టిన హరీశ్ శంకర్.. తర్వాతి చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన హరీశ్ … సినిమాలో నటీనటులు, టెక్నిషియన్ల గురించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దని గతంలో సూచించారు.
Tags : Harish Shankar, AlibabaGroup, Gabbar Singh Director, Gaddala Konda Ganesh