గంగూభాయి షూటింగ్ షురూ?

by  |
గంగూభాయి షూటింగ్ షురూ?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్ కొంచెం బాధలోనే ఉంది. ‘సడక్ 2’ ద్వారా కెరియర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న ఆలియా ప్రస్తుతం ఓ బ్లాక్ బస్టర్ అందుకుంటే తప్ప ఈ బాధ నుంచి బయటపడలేము అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ‘గంగూభాయి కథియావాడి, ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి భారీ చిత్రాలను లైన్‌లో పెట్టిన ఆలియా.. కరోనా మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైంది. కాగా, ప్రస్తుతం సెట్స్ మీదకు వెళ్లే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.

త్వరలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ‘గంగుభాయి కథియవాడి’ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతుందని తెలుస్తోంది. ముంబైలో అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుండగా.. ఆలియాభట్ సింగిల్ సీన్స్ ముందుగా చిత్రీకరించేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తక్కువ మంది టెక్నీషియన్స్ మాత్రమే అవసరం అవుతారని.. కరోనా టైమ్‌లో ఇదే బెటర్ ఆప్షన్ అని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 11, 2020లో విడుదలయ్యే సినిమా కరోనా కారణంగా వాయిదా పడగా.. త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2021 ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని అనుకుంటోంది మూవీ యూనిట్. ఎక్కడా రాజీపడకుండా సినిమా తెరకెక్కిస్తామని తెలిపిన డైరెక్టర్.. అక్టోబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పారు.

ఇక ఆలియా ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం నవంబర్, డిసెంబర్‌లో డేట్స్ కేటాయించిన విషయం తెలిసిందే. కాగా సినిమా షూటింగ్ కోసం జక్కన్న ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్‌ ఫైనల్ చేసినట్టు సమాచారం. నవంబర్ నుంచి చిత్రీకరణ సాగనుండగా.. ఆలియా కోసం కాస్ట్ అండ్ క్రూ వెయిట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed