ఆలియా తండ్రిపై అభిమానుల ఆగ్రహం

by Anukaran |
ఆలియా తండ్రిపై అభిమానుల ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ ఆలియా భట్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఉడ్తా పంజాబ్’, ‘రాజీ’ లాంటి చిత్రాలు చూస్తే అర్థం అయిపోతుంది. తను ఎంత గొప్ప నటి అనే విషయం తెలుసుకునేందుకు. తన నటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకో‌గలిగింది ఆలియా. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ ఆలియా తండ్రి‌పై కోపంగా ఉన్నారు. ‘సడక్ 2’ లాంటి చెత్త సినిమా తీసి తమ అభిమాన నటి కెరియర్ నాశనం చేశాడని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కెరియర్‌పై నెగెటివ్ ఇంప్రెషన్ పడేలా చేసిన మహేశ్ ఆలియా‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

22 ఏండ్ల తర్వాత అసలు ‘సడక్ 2’ మూవీ ఎందుకు తీయాలి అనుకున్నాడో మహేష్ భట్‌కి అయినా అర్థం అయిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఇలాంటి స్క్రిప్ట్ వేరే డైరెక్టర్లు తీసుకుని వస్తే నిర్మొహమాటంగా నో చెప్పే వారని..అలాంటిది అంత మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ఉన్న కూతురి పైనే ఇలాంటి ప్రయోగం ఎందుకు చేశాడని మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ లాంటి వారు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

పైగా నెపోటిజం గురించి పీక్స్ లో చర్చ జరుగుతుండగా.. సుశాంత్ అభిమానులు ఆగ్రహంతో ఉండగా.. ‘సడక్ 2’ ఎందుకు రిలీజ్ చేసినట్లు అని ప్రశ్నిస్తున్నారు. తర్వాత రిలీజ్ కాబోయే ఆలియా భట్ చిత్రం ‘గంగుబాయి కథియావాడి’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆలియా తన కెరియర్‌లోనే ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిందని.. మహేశ్ భట్‌కు తెలిసినా ‘సడక్ 2’ తో ఇంత చెత్త ఇంప్రెషన్ పడేందుకు కారణం అయ్యాడని.. నెక్స్ట్ సినిమాపై చాలా ప్రభావం పడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆలియతోపాటు ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఈ సినిమా ద్వారా చాలా నష్ట‌పోయాడు అని..మహేశ్ భట్ ఈ ఇద్దరి కెరియర్‌తో అడుకున్నాడని మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed