ఇంటిమేట్ సీన్స్‌లో.. ఎవరితో నటించినా నో ప్రాబ్లమ్

by Jakkula Samataha |
ali-faizal
X

దిశ, సినిమా : యాక్టర్ కపుల్ అలీ ఫజల్, రిచా చద్దాల పెళ్లి.. పాండమిక్ కారణంగా గతేడాది నుంచి వాయిదాపడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేస్తున్న జంట 2021లోగా కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని హామీఇచ్చింది. అయితే, రీసెంట్‌గా ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ ఎపిసోడ్‌లో వీరికి ఓ ప్రశ్న ఎదురైంది. ఇద్దరు కూడా ఇతర యాక్టర్స్‌తో ఇంటిమేట్ సీన్స్ చేయాల్సి వచ్చినపుడు ఒకరి గురించి మరొకరు ఏం అనుకుంటారు? ఎప్పుడైనా పొసెసివ్‌గా ఫీల్ అయ్యారా? అని అడిగితే అదేంలేదని సమాధానమిచ్చారు.

ముద్దులు పెట్టుకోవడం, రొమాన్స్‌లో మునిగితేలడం.. అన్నీ యాక్టింగ్‌లో భాగమే. అలాంటప్పుడు ఫీల్ అవడానికి ఏం లేదని రిచా రిప్లై ఇచ్చింది. కాగా ‘ఫక్రీ, ఫక్రీ రిటర్న్స్’లో కలిసి నటించిన అలీ, రిచా.. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కరోనా పరిస్థితుల్లో కొంతకాలం వర్క్ లేకపోవడంతో ఖాళీగా కూర్చున్నామని. ముందు కొంత డబ్బు సంపాదించుకున్నాకే పెళ్లి చేసుకుంటామని అలీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

Advertisement

Next Story