ఈ ఏడాదికి ఐపీఎల్‌ను మరిచిపోవాల్సిందే : అలెక్స్ కేరీ

by Shyam |
ఈ ఏడాదికి ఐపీఎల్‌ను మరిచిపోవాల్సిందే : అలెక్స్ కేరీ
X

కరోనా ధాటికి క్రీడలన్నీ వాయిదా పడుతున్నాయి. బీసీసీఐ సైతం తమ ప్రతిష్టాత్మక టోర్నీ ఐపీఎల్‌ను అనేక తర్జన భర్జనల తర్వాత నిరవధికంగా వాయిదా వేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే ఐపీఎల్ నిర్వహణపై తదుపరి ప్రకటన చేస్తామని చెప్పింది. కాగా, కొంత మంది క్రీడాకారులు మాత్రం టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఐపీఎల్ జరుగుతుందేమోననే ఆశాభావంతో ఉన్నారు. ఒక వేళ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా పడితే అప్పుడు ఐపీఎల్ నిర్వహించాలని కూడా సలహాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ అలెక్స్ కేరీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం సాధ్యం కాదని.. ఈ ఏడాదికి ఐపీఎల్‌ను మర్చిపోవాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.

”నాకు ఢిల్లీలో క్రికెట్ ఆడటం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఐపీఎల్‌లో ఈ ఏడాదే నాకు తొలి సీజన్. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఐపీఎల్ సాధ్యం కాదనే అనిపిస్తోంది. త్వరలోనే సాధారణ పరిస్థితులకు మనం చేరుకుంటామని ఆశిస్తున్నా” అని కేరీ అన్నాడు. ఈ కరోనా క్లిష్ట సమయంలో కుటుంబంతోనే ఎక్కువ సేపు గడుపుతున్నానని.. అందరూ ఇండ్లల్లోనే ఉండాలని కోరారు. ఈ ఏడాది క్రికెట్‌కు క్లిష్ట పరిస్థితని ఈ వికెట్ కీపర్ – బ్యాట్స్ మన్ అభిప్రాయపడ్డాడు.

Tags :Corona, BCCI, Alex Carey, Wicket keeper, IPL, T20, Australia

Advertisement

Next Story

Most Viewed