- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలనతో నల్లమల ప్రజలకు భరోసా
దిశ, అచ్చంపేట: ఆలనతో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు భరోసా కలిగిస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ఆలన వాహనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గర్బసంచి, గొంతు క్యాన్సర్, పక్షవాతం, తదితర దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకెళ్లి చికిత్స అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అచ్చంపేట డివిజన్‌లో గల లింగాల, ఉప్పునుంతల, అంబట్ పల్లి, బల్మూర్, సిద్దాపూర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వాహనం సేవలందిస్తుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్, ప్రొగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శివరామ క్రిష్ణ, ఉప మలేరియా అధికారులు అశోక్ ప్రసాద్ పాల్గొన్నారు.