- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐఎండీబీలో చోటు దక్కించుకున్న ‘అల’
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు ‘బాక్సాఫీస్’ వద్ద సందడి చేసేవి. కానీ కరోనా ఈ సారి ఆ హంగామాకు బ్రేక్ వేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు మాత్రమే ఈ ఏడాది విడుదలైన భారీ సినిమాలుగా చెప్పొచ్చు. ఈ రెండు కూడా బిగ్గెస్ట్ హిట్స్ సాధించి, కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాగా ‘అల వైకుంఠపురం’ సినిమా టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలు ఇప్పటికీ యూట్యూబ్‌లో సంచలన రికార్డులు నమోదు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బన్నీ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డును దక్కించుకుంది.
ఐఎండీబీ 2020లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్స్ జాబితా విడుదల చేయగా, ఇండియా నుంచి కేవలం రెండు సినిమాలు మాత్రం అందులో చోటు సంపాదించుకున్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ టాప్ 20లో నిలవడంతో హర్షం వ్యక్తం చేసిన మూవీ మేకర్స్.. ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రికార్డును తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ మూవీ ‘భాగీ 3’ కూడా ఈ జాబితాలో నిలిచింది. ‘అల’ సృష్టిస్తున్న రికార్డులతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
https://twitter.com/GeethaArts/status/1335145187924795395