- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయనది భయమే తెలియని బ్లడ్: స్టార్ హీరో కామెంట్స్..
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనూ సూద్ కాంబినేషన్‌లో చిత్రం ‘పృథ్వీరాజ్’ రూపొందింది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారా మాజీ మిస్ ఇండియా మానుషి చిల్లర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. ధైర్యం, పరాక్రమానికి మారుపేరుగా నిలిచిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక టీజర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన అక్షయ్.. ‘ఈ టీజర్ సినిమా ఆత్మను ప్రతిబింబిస్తుంది. భయమే తెలియని గొప్ప యోధుడు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత సారాన్ని తెలియజేస్తుంది. చౌహాన్ గురించి తెలుసుకున్న కొద్దీ నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతీ క్షణం దేశం, విలువల కోసం జీవించిన ఆయన జీవితానికి ఇదే మా నివాళి’ అని తెలిపాడు. కాగా కొవిడ్ కారణంగా వాయిదాపడ్డ సినిమాను వచ్చే ఏడాది జనవరి 21 విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
- Tags
- akshay kumar