అక్షర హార్ట్ ఫెల్ట్ నోట్

by  |
అక్షర హార్ట్ ఫెల్ట్ నోట్
X

కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అడుగు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రకంగా ఈ మహమ్మారి ప్రభావం చూపిస్తూనే ఉంది. ఎంతో మంది ప్రాణాలను బలిగొంటూనే ఉంది. ఇప్పటికే కరోనా బారిన పడి చాలా మంది ప్రముఖులు మృత్యువాత పడగా.. తన సోదరుడిగా భావించే మేకప్ ఆర్టిస్టును కోల్పోయిన అక్షర హాసన్.. సోషల్ మీడియాలో హార్ట్ ఫెల్ట్ నోట్ పోస్ట్ చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా బ్రదర్ సచిన్ దాదా చనిపోవడంతో గుండె బరువెక్కిందని ఆవేదన వ్యక్తం చేసింది అక్షర. షమితాబ్ సినిమా నుంచి తన మేకప్ ఆర్టిస్టుగా ఉన్న దాదా.. చాలా పాజిటివ్ వ్యక్తని తెలిపింది. తనెప్పుడూ ఆనందంగా ఉండేవాడని, తనతో కలిసి ప్రాంక్స్ చేసేదాన్నని తెలిపిన అక్షర.. గొప్ప ప్రతిభ గల వ్యక్తి అని చెప్పింది. తను మా అందరికీ కూడా మంచి స్నేహితుడని.. ఇద్దరు పిల్లలకు గొప్ప ఫాదర్ అని, గొప్ప భర్తగా భార్యకు అన్ని సమకూర్చేవాడని తెలిపింది. దాదా కుటుంబానికి దేవుడు మరింత బలాన్ని ఇవ్వాలని.. దాదా ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంది అక్షర.


Next Story

Most Viewed