నా ఉద్దేశం అర్థం కానట్టుంది : అక్తర్

by Shyam |
నా ఉద్దేశం అర్థం కానట్టుంది : అక్తర్
X

కరోనాపై పోరాటానికి విరాళాల సేకరణ కోసం భారత్ – పాక్ మధ్య మూడు వన్డేల సిరీస్ నిర్వహించాలన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదనను కపిల్ దేవ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే కపిల్ వ్యాఖ్యలపై తాజాగా అక్తర్ స్పందించాడు. ‘నేను చెప్పాలనుకున్న విషయం కపిల్ భాయ్‌కు సరిగా అర్థం కానట్టుంది’ అన్నాడు. భారత్‌కు డబ్బు అవసరం లేకపోయుండవచ్చు కానీ, అందరూ అలా ఉండలేరు కదా.. అని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. రెండు దేశాల్లోనూ పేదలున్నారని, కరోనా నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

తాను బాగా ఆలోచించే మాట్లాడుతున్నానని, మరో ఆరునెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే.. క్రికెట్‌పై ఆధారపడి బతికేవారి సంగతి ఎలా ? అని ప్రశించాడు. అందుకే ఈ పరిస్థితులను అధిగమించేందుకు విరాళాల సేకరణ ఒక్కటే మార్గమని సూచించాడు. దీని వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందని చెప్పాడు.

Tags: Shoaib Akhtar, Kapil Dev, Fundraising, One Day series

Advertisement

Next Story

Most Viewed