- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. ఏ1గా భూమా అఖిల ప్రియ
దిశ, వెబ్‌డెస్క్ : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు ఆ కేసులో ఏ2గా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ.. నేడు అనూహ్యంగా ఏ1గా పోలీసులు ప్రకటించారు. కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి ఆమేనని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అదనంగా అఖిలప్రియపై మరో రెండు సెక్షన్లను చేర్చి కేసును పకడ్బందీగా మార్చుతున్నారు. ఆమెపై ఐపీసీ సెక్షన్లు 147, 385 లను చేర్చారు. దీనిపై అఖిల ప్రియ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిన్నటి వరకు ఏ2గా ఉన్న వారిని హఠాత్తుగా ఏ1గా ఎలా మార్చుతారని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఆయన కోర్టుకు కూడా విన్నవించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న అఖిలప్రియకు 41 సీఆర్పీసీ నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఆమె ఆరోగ్యం బాలేనందున వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్‌లో కోరారు. దీనిపై స్పందించిన సికింద్రాబాద్ కోర్టు… కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారాని(రేపటి)కి వాయిదా వేసింది.