కొత్త జోనర్ ట్రై చేస్తున్న అఖిల్

by  |
కొత్త జోనర్ ట్రై చేస్తున్న అఖిల్
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిల్ అక్కినేని తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలిపాడు. ఇది అఖిల్‌కు ఐదో సినిమా కాగా.. చాలా స్పెషల్ అంటూ సోషల్ మీడియాలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపాడు.

కాగా, ఇప్పటి వరకు సరైన హిట్ లేని అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీగా ఉండగా.. సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌లో రిలీజైన పోస్టర్ అండ్ సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. పూర్తిగా లవ్ అండ్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్మెంట్‌తో సాగే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా హిట్ ఖాయమని ధీమాగా ఉన్న అఖిల్.. సురేందర్ రెడ్డి సినిమాతో మరో జోనర్ ట్రై చేస్తున్నాడో ఏమో చూడాలి మరి.


Next Story