- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాలీవుడ్ కండల వీరుడు అయ్యగారే.. అఖిల్ జిమ్‌బాడీపై ప్రశంసలు
దిశ, సినిమా: యంగ్ హీరో అఖిల్ అక్కినేని.. తన జిమ్ బాడీ పిక్స్‌తో సోషల్ మీడియాను హీటెక్కించాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ ఇచ్చిన కిక్‌తో కెరీర్‌పై ఫుల్ కాన్సంట్రేట్ చేసిన అఖిల్.. అప్‌కమింగ్ మూవీ ‘ఏజెంట్’ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘త్వరలోనే తుఫాన్ రాబోతుంది. నాకు ఈ విషయం తెలుస్తోంది’ అంటూ 2022 నెంబరు పక్కన ఫైర్ ఎమోజీ యాడ్ చేశాడు.
వైరల్ అవుతున్న ఈ ఫొటోపై టాలీవుడ్ హంక్ రానా ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేయగా.. ‘అయ్యగారు మీరే కింగ్, దేనికైనా సరే ఆయనే నంబర్ వన్’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ‘ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమాస్’ ప్రొడక్షన్ కంపెనీలో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘ఏజెంట్’ మూవీలో అఖిల్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు.