- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుజారాపై వచ్చే వార్తలు దాదాపు అవాస్తవమే : ఆకాశ్ చోప్రా
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా నయా వాల్‌గా పేరు తెచ్చుకున్న చతేశ్వర్ పుజారా గత కొన్నేళ్లుగా భారత టెస్టు బ్యాటింగ్ లైనప్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఎన్నో కీలకమైన సమయాల్లో భారత జట్టును తన డిఫెన్సింగ్ ఆటద్వారా గట్టెక్కించాడు. అయితే ఇటీవల వరుసగా విఫలం అవుతున్న పుజారాను రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌లో టీమ్ ఇండియా యాజమాన్యం తుది జట్టు నుంచి పక్కకు తప్పిస్తుందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆ వార్తలను ఖండించారు. పుజారాపై వస్తున్న వార్తలు దాదాపు అవాస్తవమేనని, తాను వాటిని నమ్మనని అన్నారు. తాజాగా ఆకాశ్ చోప్రా ఫేస్‌బుక్ పేజీలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆకాశ్ స్పందించారు.
‘పుజార ఒక మంచి టెస్టు బ్యాట్స్‌మాన్. టెస్టుల్లో అతడి సగటు చాలా బాగుంది. ఇంగ్లాండ్ పిచ్‌లపై విఫలం అవుతున్నాడని చాలా మంది అతడిపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ సగటు 30 కంటే ఎందుకు తక్కువగా ఉందో ఆలోచించడం లేదు. ఎన్నో సార్లు డిఫెన్సీవ్ గా ఆడుతూ జట్టును ఆదుకున్నాడు. పరుగులు తీయకపోయినా రోజంతా క్రీజలో నిలబడి మ్యాచ్‌లు ఓడిపోకుండా చూశాడు. అది తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్. అలా ఆడటం వల్ల చాలా సార్లు టీమ్ ఇండియా లాభపడింది’ అంటూ ఆకాశ్ చోప్రా సమాధానం ఇచ్చాడు. పుజార చివరి సారిగా 2019లో సిడ్నీలో జరిగిన టెస్టులో సెంచరీ బాదాడు. ఆ తర్వాత 18 టెస్టులుగా పుజారాకు శతకం లేదు.