‘బాలా’ సాంగ్‌తో అదరగొట్టిన ఆకాంక్ష

by Jakkula Samataha |
‘బాలా’ సాంగ్‌తో అదరగొట్టిన ఆకాంక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీఫుల్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ‘మళ్లీ రావా’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ అనిపించుకున్న భామ..వెంటనే ‘దేవ్‌దాస్’ మూవీలో కింగ్ నాగ్ సరసన చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం సౌత్‌లో బిజీ అయిపోయిన ఆకాంక్ష..లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చూసి సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.

https://twitter.com/aakanksha_s30/status/1303920619969421313?s=20

బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్‌కు లేట్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆకాంక్ష..లేటెస్ట్‌గా పెట్టిన వీడియో అందరినీ నవ్విస్తుంది. అక్షయ్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిన తను..సూపర్ హిట్ సాంగ్ “బాలా బాలా” సాంగ్‌పై చాలా ఫన్నీ వేలో , చాలా క్యూట్‌గా డ్యాన్స్ చేసి నెటిజన్లను ఫిదా చేసింది. సూపర్ క్రేజీగా ఉన్న వీడియోకు సూపర్ కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. కాగా, క్రేజీగా, ఫన్నీగా లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని అక్షయ్‌ను చూసి నేర్చుకున్నాను అని తెలిపిన ఆకాంక్ష సింగ్. నటుడిగా అన్ని హద్దులు ఎలా విచ్ఛిన్నం చేయాలో కూడా తన వల్లే నేర్చుకున్నట్లు చెప్పింది. చాలా కాలం కిందట ఈ వీడియో చేశామని.. మీ పుట్టినరోజు కన్నా గొప్ప సందర్భం లేదని అనిపించి..ఇప్పుడు పోస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఆలస్యంగా విష్ చేసినందుకు క్షమించాలని కోరింది.

Advertisement

Next Story